Ravi teja: మనసు గల్లంతే..

సంక్రాంతి బరిలో ‘ఈగల్‌’తో యాక్షన్‌ హంగామా రుచి చూపించనున్నారు రవితేజ.

Updated : 25 Dec 2023 09:21 IST

సంక్రాంతి బరిలో ‘ఈగల్‌’తో యాక్షన్‌ హంగామా రుచి చూపించనున్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కించారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. కావ్య థాపర్‌, అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికలు. ఈ సినిమా జనవరి 13న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 27న ‘‘గల్లంతే..’’ అనే పాట విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. అందులో కావ్య, రవితేజ రొమాంటిక్‌ లుక్‌లో కనిపించారు. ‘తొలిపాట‘ఆడుమచ్చా...’ తరహాలో సాగితే ఈ రెండో గీతం మనసుల్ని హత్తుకునే మెలోడీలా ఉంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: డేవ్‌ జాంద్‌, ఛాయాగ్రహణం:  కార్తీక్‌, కమిల్‌ ప్లాకి, కర్మ్‌ చావ్లా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని