Ravi teja: తొలిసారి ఈగల్‌ కోసమే అలాంటి మేకోవర్‌ చేశా: రవితేజ

‘‘ఈగల్‌’ సినిమా చాలా బాగా వచ్చింది. ఇక ప్రేక్షకుల స్పందన కోసం ఎదురు చూస్తున్నా’’ అంటున్నారు రవితేజ.

Updated : 06 Feb 2024 09:26 IST

‘‘ఈగల్‌’ సినిమా చాలా బాగా వచ్చింది. ఇక ప్రేక్షకుల స్పందన కోసం ఎదురు చూస్తున్నా’’ అంటున్నారు రవితేజ. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. కావ్య థాపర్‌, అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికలు. ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇటీవల విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో రవితేజ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు కార్తీక్‌కు చాలా స్పష్టత ఉంది. ఈ సినిమాని తను అద్భుతంగా తెరకెక్కించారు. దీంట్లో నాకు నేను విపరీతంగా నచ్చిన గెటప్‌లో కనిపిస్తాను. ఆ గెటప్‌ రావడానికి మూడు నెలలు పట్టింది. నేను అలాంటి మేకోవర్‌ చేయడం ఇదే తొలిసారి. అనుపమ పాత్రే ఈ కథను నడిపిస్తుంది. నవదీప్‌, అవసరాల శ్రీనివాస్‌, శ్రీనివాస్‌ రెడ్డి అందరూ అద్భుతంగా చేశారు. డేవ్‌ జాంద్‌ చక్కటి సంగీతమందించాడు. ఈ నెల 9న థియేటర్స్‌లో కలుద్దాం’’ అన్నారు. ‘‘గొప్ప థియేట్రికల్‌ అనుభూతిని అందించే చిత్రమిది. తప్పకుండా అందరూ థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని. నటి అనుపమ పరమేశ్వరన్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో రవితేజ చాలా అద్భుతంగా కనిపిస్తారు. ఆయనతో మరిన్ని చిత్రాలు చేయాలనుంది’’ అంది. ‘‘ఇదొక స్టైలిష్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. మంచి సందేశంతో పాటు అద్భుతమైన క్లైమాక్స్‌ ఉంది’’ అన్నారు నిర్మాత విశ్వప్రసాద్‌. ఈ కార్యక్రమంలో అనుదీప్‌, శ్రీరామ్‌ ఆదిత్య, కావ్య, శ్రీనివాస్‌ అవసరాల తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని