Ravi Teja: వానరం పాత్రకు రవితేజ గళం

హనుమంతుడి కథ అంటే వానరం ప్రస్తావన లేకుండా ఎలా ఉంటుంది? భారతీయ ఇతిహాసం స్ఫూర్తితో తెరకెక్కుతున్న సూపర్‌ హీరో చిత్రం ‘హను - మాన్‌’లోనూ కోటి అనే వానరం పాత్ర కీలకంగా ఉంటుందట. ఆ పాత్రకు అగ్ర కథానాయకుడు రవితేజ గళాన్నిచ్చినట్టు సినీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో...

Updated : 28 Dec 2023 09:40 IST

హనుమంతుడి కథ అంటే వానరం ప్రస్తావన లేకుండా ఎలా ఉంటుంది? భారతీయ ఇతిహాసం స్ఫూర్తితో తెరకెక్కుతున్న సూపర్‌ హీరో చిత్రం ‘హను - మాన్‌’లోనూ కోటి అనే వానరం పాత్ర కీలకంగా ఉంటుందట. ఆ పాత్రకు అగ్ర కథానాయకుడు రవితేజ గళాన్నిచ్చినట్టు సినీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో... తేజ సజ్జా కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రమిది. అమృత అయ్యర్‌ కథానాయిక. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, వినయ్‌రాయ్‌ కీలక పాత్రలు పోషించారు. కె.నిరంజన్‌ రెడ్డి నిర్మాత. చైతన్య సమర్పకులు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రం తెలుగు సహా భారతీయ భాషల్లోనూ, కొన్ని విదేశీ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇందులో సినిమా అంతటా కనిపించే కోటి పాత్రకి రవితేజ గళాన్నిచ్చారని చిత్రబృందం తెలిపింది. ‘‘చంచలమైన స్వభావం, చమత్కారమైన చర్యలు, శక్తికి ప్రసిద్ధి వానరములు. రవితేజ గళంతో కోటి పాత్ర మరింత చమత్కారంగా, శక్తిమంతంగా ముస్తాబవుతోంది. ఇలాంటి ప్రయత్నాల్ని ప్రోత్సహించడంలో రవితేజ ఎప్పుడూ ముందుంటారు. ఆయనకి కృతజ్ఞతలు. అంజనాద్రి అనే ఫాంటసీ లోకం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంద’’ని చిత్ర వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని