Mahaveerudu: తెలుగులో రవితేజ.. తమిళంలో విజయ్‌ సేతుపతి..

Mahaveerudu: ‘ధైర్యమే జయం’అంటున్నారు రవితేజ. శివకార్తికేయన్‌ నటించిన ‘మహా వీరుడు’ చిత్రానికి ఆయన వాయిస్‌ ఓవర్‌ అందిస్తున్నారు.

Published : 11 Jul 2023 20:09 IST

హైదరాబాద్‌: శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మహావీరుడు’ (Mahaveerudu). అదితి శంకర్‌ కథానాయిక. ఓ భిన్న కథాంశంతో మడోన్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 14న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర అప్‌డేట్‌ను చిత్ర బృందం పంచుకుంది.  ఇండస్ట్రీలో ఒకరి చిత్రాలకు మరొకరు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం సహజమే. కథ, పాత్రలను పరిచయం చేయడం లేదా సినిమా ఆసాంతం అక్కడక్కడా తమ మాటలతో కథను ముందుకు నడిపించడం చేస్తుంటారు.

ఇప్పుడు ‘మహావీరుడు’లో శివకార్తికేయన్‌ పాత్రను తన వాయిస్‌తో రవితేజ నడిపించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ట్వీట్‌ చేసింది. అలాగే తమిళంలో విజయ్‌ సేతుపతి వాయిస్‌ ఓవర్‌ అందించనున్నారు. ‘చెవిలో ఒక గొంతు వినపడుతూ ఉంది’ అంటూ శివ కార్తికేయన్‌ తలపైకెత్తి చూస్తే చెప్పే సంభాషణతో మొదలైన వీడియో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. చివరిలో ‘ధైర్యమే జయం’ అంటూ రవితేజ (Ravi teja) డైలాగ్‌తో ముగిసింది. మాస్‌ యాక్షన్‌ కథాంశంతో ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని