Ravi Teja: బచ్చన్‌.. యాక్షన్‌

రవితేజ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. ‘షాక్‌’, ‘మిరపకాయ్‌’ లాంటి చిత్రాల తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న హ్యాట్రిక్‌ సినిమా ఇది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. శుక్రవారం రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త లుక్‌ విడుదల చేశారు.

Updated : 27 Jan 2024 11:16 IST

వితేజ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. ‘షాక్‌’, ‘మిరపకాయ్‌’ లాంటి చిత్రాల తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న హ్యాట్రిక్‌ సినిమా ఇది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. శుక్రవారం రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త లుక్‌ విడుదల చేశారు. అందులో రవితేజ తన చుట్టూ ఉన్న గూండాల్ని చితకొట్టి  స్టైలిష్‌గా నడిచొస్తున్నట్లు కనిపించారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కరైకుడిలో జరుగుతోంది. ఇందులో భాగంగా రవితేజపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె మేయర్‌, ఛాయాగ్రహణం: అయనంక బోస్‌.

ఈగల్స్‌ ఆన్‌ హిస్‌ వే..

‘ఈగల్‌’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు రవితేజ. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఈ సినిమా నుంచి ‘‘ఈగల్స్‌ ఆన్‌ హిస్‌ వే’’ అనే గీతాన్ని విడుదల చేశారు. దీనికి డేవ్‌ జాంద్‌ స్వరాలు సమకూర్చారు. జార్జినా మాథ్యూ సాహిత్యమందించడంతో పాటు స్వయంగా ఆలపించారు. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌, కావ్య థాపర్‌ కథానాయికలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని