Ravi Teja: హిట్టు జోడీ మరోసారి?

కథానాయకుడు రవితేజ 75వ సినిమా ఇప్పటికే ఖరారైంది. కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించనున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇది వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 28 May 2024 01:17 IST

థానాయకుడు రవితేజ 75వ సినిమా ఇప్పటికే ఖరారైంది. కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించనున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇది వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రీకరణను ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది చిత్ర బృందం. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా వచ్చే నెల నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మిగిలిన ప్రధాన తారాగణాన్ని ఖరారు చేసే పనిలో పడింది చిత్ర బృందం. ఇందులో భాగంగా రవితేజకు జోడీగా శ్రీలీలను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్ర బృందం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. శ్రీలీల ఇప్పటికే రవితేజతో కలిసి ‘ధమాకా’లో సందడి చేసిన సంగతి తెలిసిందే. అది బాక్సాఫీస్‌ ముందు మంచి విజయాన్ని దక్కించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని