Ravi teja: ఈగల్‌.. ఆడు మచ్చా!

‘ఈగల్‌’గా సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నారు.

Updated : 04 Dec 2023 09:36 IST

‘ఈగల్‌’గా సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. కావ్యా థాపర్‌, అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికలు. ఈ సినిమా జనవరి 13న విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈనెల 5న ఈ చిత్రం నుంచి తొలి పాటగా ‘‘ఆడు మచ్చా..’’ అనే గీతాన్ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఇదొక భిన్నమైన స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌. రవితేజ మునుపెన్నడూ చేయని శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకి డేవ్‌ జాంద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. కార్తీక్‌, కమిల్‌ ప్లాకి, కర్మ్‌ చావ్లా ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు