Raviteja: ఈగల్‌.. వేటకు సిద్ధం

ఈగల్‌’గా సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Updated : 25 Nov 2023 09:34 IST

‘ఈగల్‌’గా సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. కావ్య థాపర్‌, అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికలు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు చిత్ర బృందం శుక్రవారం ప్రకటించింది. ఈ సందర్భంగా ఇది మరో 50రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలియజేస్తూ కౌంట్‌డౌన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో రవితేజ ఇంటెన్స్‌ లుక్‌లో స్టైలిష్‌ డ్రెస్సింగ్‌తో కనిపించగా.. ఆయన టేబుల్‌పై భిన్న రకాలైన తుపాకులు ఉండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘‘ఇదొక వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందుతోంది. రవితేజ మునుపెన్నడూ చేయని శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారు. నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి డేవ్‌ జాంద్‌ సంగీతమందిస్తుండగా.. కార్తీక్‌, కమిల్‌ ప్లాకి, కర్మ్‌ చావ్లా ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ఇది జనవరి 13న థియేటర్లలోకి రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని