Ravi teja: ఈగల్‌.. ట్రైలర్‌ రేపే..

రవితేజ కథానాయకుడిగా కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగల్‌’. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. కావ్య థాపర్‌, అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికలు.

Updated : 19 Dec 2023 09:25 IST

వితేజ కథానాయకుడిగా కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగల్‌’. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. కావ్య థాపర్‌, అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికలు. నవదీప్‌, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 20న ట్రైలర్‌ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందుతోంది. డేవ్‌ జాంద్‌ సంగీతమందిస్తుండగా.. కార్తీక్‌, కమిల్‌ ప్లాకి, కర్మ్‌ చావ్లా ఛాయాగ్రాహకులుగా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు