Ravi teja: మిస్టర్‌ బచ్చన్‌ మొదలెట్టాడు

రవితేజ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమా గురువారం నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణను ప్రారంభించుకుంది.

Updated : 29 Dec 2023 09:32 IST

వితేజ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమా గురువారం నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణను ప్రారంభించుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది. ప్రస్తుతం రవితేజతో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. యాక్షన్‌ ప్రాధాన్యమున్న ఓ ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో రవితేజ భిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాకి సంగీతం: మిక్కీ జె మేయర్‌, ఛాయాగ్రహణం: అయనంక బోస్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని