Renu Desai: అంకుల్‌ మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది.. రేణూ దేశాయ్‌ వ్యంగ్యాస్త్రాలు

తనను తక్కువ చేసి మాట్లాడారంటూ ఓ జర్నలిస్ట్‌పై నటి రేణూ దేశాయ్‌ మండిపడ్డారు. సోషల్‌ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

Published : 09 Dec 2023 01:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటిగా రేణూ దేశాయ్‌ (Renu Desai) ఇటీవల రీ- ఇంట్రీ ఇచ్చారు. ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమాలోని ఓ కీలక పాత్రతో ఆమె చాలాకాలం తర్వాత ప్రేక్షకులను పలకరించారు. రేణూ దేశాయ్‌ మళ్లీ తెరపైకి రావడంపై ఓ జర్నలిస్ట్‌ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అందులో ఆమె వ్యక్తిగత విషయాలపైనా ఆయన కామెంట్స్‌ చేశారు. సదరు దృశ్యాలను రేణూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఆయనపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. గతంలో తాను సాధించిన విజయాలను గుర్తుచేశారు. మహిళలను తక్కువగా చూడడం తగదన్నారు.

‘‘అంకుల్‌ మీరు నా నామస్మరణ చేసి వ్యూస్‌ సంపాదిస్తున్నారు. నా పేరు వాడుకుని మీరు డబ్బులు సంపాదిస్తున్నందుకు నాకు ఆనందమే. కుర్చీలో కూర్చొని సినీ నటులపై గాసిప్స్‌ చెప్పడం కంటే మీ ప్రతిభతో సంపాదిస్తే ఇంకా బాగుంటుంది. ఏదైనా మంచి పని చేయండి. దైవ నామస్మరణ చేయండి. ఇంత వయసొచ్చిన తర్వాత కూడా మీ అనుభవం ఇలా ఉందంటే జాలేస్తోంది. నేను మిమ్మల్ని ఎప్పుడూ కలవలేదు. నా గురించి మీకు తెలియదు. కానీ, నాపై ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. మన కల్చర్‌లో స్త్రీలను దుర్గాదేవి, కాళీమాతగా భావిస్తారు. మగవారి పేరు, ప్రోత్సాహం లేకుండా మహిళలు ఏం చేయలేరని మీలాంటి వారు మాట్లాడుతుంటారు’’ అని రేణూ దేశాయ్‌ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తన గురించి మాట్లాడినందుకే ఆ పోస్ట్‌ పెట్టలేదని, సమాజంలో మహిళలపై కొందరు మగవారికి ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పేందుకే పెట్టినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని