Renu Desai: నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్‌ కామెంట్‌పై రేణూ దేశాయ్‌ అసహనం

ఓ నెటిజన్‌ పెట్టిన కామెంట్‌పై స్పందించిన రేణూదేశాయ్‌ ‘నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు?’ అని అసహనం వ్యక్తంచేశారు.

Published : 18 May 2024 15:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సోషల్‌ మీడియాలో నేను పెట్టే ప్రతీ పోస్ట్‌పై స్పందిస్తూ ఎప్పుడూ నా మాజీ భర్తతో నన్ను పోలుస్తారెందుకు?’ అంటూ నటి రేణూదేశాయ్‌ (Renu Desai) అసహనం వ్యక్తంచేశారు. ఓ నెటిజన్ చేసిన కామెంట్‌పై ఆమె ఇలా రియాక్ట్‌ అయ్యారు. జంతు సంరక్షణ కోసం ఆమె ఇటీవల విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. ఆ విషయమై సదరు నెటిజన్‌ ‘మా పవన్‌ కల్యాణ్‌ అన్నయ్యలా గోల్డెన్‌ హార్ట్‌’ అని రేణు పోస్ట్‌కు కామెంట్‌ పెట్టాడు. దీనికి ఆమె బదులిస్తూ.. ‘‘పదేళ్ల వయసు నుంచి నేను జంతు సంరక్షణ కోసం నావంతు సాయం చేస్తున్నా. దానికి నా మాజీ భర్తతో సంబంధం లేదు. జంతువులపై నేను చూపించే ప్రేమ, కేర్‌ ఆయనకు లేవు. దయచేసి నేను చేసే పనుల గురించి పోస్ట్‌ పెడితే.. ఆయన ప్రస్తావన తీసుకొస్తూ కామెంట్‌ చేయకండి’’ అని విజ్ఞప్తి చేశారు.

నా అకౌంట్‌ హ్యాక్‌ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్‌ పెట్టా!

ఈ మాటలు బాధతో అన్నవే గానీ కోపంతో కాదని మరో పోస్ట్‌ ద్వారా తెలిపారు. వ్యక్తిగతంగా తన మాజీ భర్తతో ఎలాంటి సమస్య లేదని, తనని తానుగా చూడాలంటూ కామెంట్స్‌ చేసే వారిని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని