Renuudesai: అకీరాకు రేణూదేశాయ్‌ సలహా.. నెమ్మదిగా అలవాటు మార్చుకున్నాడట!

Renuudesai: నటి రేణూదేశాయ్‌ ఇన్‌స్టా వేదికగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

Updated : 24 Feb 2024 17:23 IST

హైదరాబాద్‌: సామాజిక మాధ్యమాల వేదికగా తరచూ తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు నటి, పవన్‌కల్యాణ్‌ మాజీ సతీమణి రేణూదేశాయ్‌ (Renu Desai). అప్పుడప్పుడు అకీరా (akira nandan), ఆద్యలకు సంబంధించిన విషయాలను సైతం ఆమె వెల్లడిస్తారు. ఇటీవల అకీరాకు తాను ఓ సలహా ఇచ్చానని, నెమ్మదిగా దాన్ని పాటిస్తున్నాడని చెప్పారు.

‘వైర్‌ కలిగిన ఇయర్‌ఫోన్స్‌ వాడమని అకీరా, ఆద్యలకు చెబుతూ వస్తున్నా. ఎందుకంటే బ్లూటూత్‌ టెక్నాలజీ వారి చెవులు, బ్రెయిన్‌కు హాని కలిగించే అవకాశం ఉంది. అప్పటినుంచి అకీరా తన అలవాటును మార్చుకుని ఫ్యాన్సీ వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌ను పక్కనపెట్టి, వైర్‌తో ఉన్న ఇయర్‌ఫోన్స్‌ వాడుతున్నాడు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. రేణూదేశాయ్‌ గతేడాది ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రంతో వెండితెరకు రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, అతను డబ్బు మనిషి కాదని ఇటీవల పేర్కొన్నారు. ఈమేరకు ఆమె ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్‌ చేశారు. పవన్‌ చాలా అరుదైన వ్యక్తి అని, రాజకీయంగా ఆయనకే తన మద్దతు ఉంటుందని ఆమె చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని