Rishb shetty: స్టార్‌ హీరోను కలిసిన రిషబ్‌ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!

మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌ను కాంతార హీరో రిషబ్‌ శెట్టి కలిశారు.

Published : 18 Apr 2024 19:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్వీయ దర్శకత్వంలో రిషబ్‌ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన చిత్రం ‘కాంతార’ (Kantara). ఘన విజయాన్ని అందుకున్న ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్నిచోట్ల భారీ కలెక్షన్లు సొంతం చేసుకుంది. ఇప్పుడు దీని ప్రీక్వెల్‌గా ‘కాంతార 2’ సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. దానికి కారణం మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌ను రిషబ్‌శెట్టి కలవడమే. తాజాగా ఈ కాంతార హీరో సోషల్‌మీడియాలో కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. మోహన్‌లాల్‌ను కలిసినట్లు తెలిపారు. లెజెండరీ నటుడిని కలవడం ఎంతో గౌరవంగా ఉందన్నారు. ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు ‘కాంతార 2’ కోసమే వీళ్లిద్దరూ కలిశారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. వీళ్లిద్దరినీ ఒకే స్క్రీన్‌పై చూడాలని ఉందని కోరుకుంటున్నారు. 

‘కాంతార 2’ విషయానికొస్తే.. దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తొలిభాగం కథ ఎక్కడైతే ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన సంఘటనలను ఇందులో చూపనున్నారు. అలాగే పంజుర్లికి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉండనున్నాయి. రిషబ్‌ ఈ సినిమా కోసం గుర్రపుస్వారీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే దీన్ని ప్రేక్షకుల ముందుకుతీసుకురావాలని మేకర్స్‌ భావిస్తున్నారు. మొదటిభాగం షూటింగ్‌ను ఎక్కువ శాతం రిషబ్‌ సొంత ఊరు ఐవర్‌ కందపురలో చేశారని.. ఇక రెండోభాగం బెంగళూర్‌లోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మొదటి పార్ట్‌ను తక్కువ బడ్జెట్‌తో ముగించారు. అయితే ఈ ప్రీక్వెల్‌ను మాత్రం భారీ బడ్జెట్‌తో తీయనున్నారట. అలాగే ఈసారి నటీనటుల ఎంపికలో కూడా మార్పులు చేయనున్నారని టాక్‌. మొత్తం షూటింగ్‌ను నాలుగు షెడ్యూళ్లలో పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోందట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని