Kantara2: కాంతార2..షూటింగ్‌ మొదలయ్యేది ఎప్పుడంటే?

రిషబ్‌ శెట్టి నటించిన కాంతార ప్రీక్వెల్‌ త్వరలో ప్రారంభం కానుందని సన్నిహత వర్గాలు తెలిపాయి.

Published : 20 Mar 2024 19:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిషబ్‌ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతార’(Kantara). ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్‌ కాదు ప్రీక్వెల్‌గా ‘కాంతార2’(Kantara2) ఉంటుందని హీరో రిషబ్‌ శెట్టి గతంలో ప్రకటించారు. తొలి భాగం కథ ఎక్కడైతే ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన సంఘటనలను ఇందులో చూపనున్నట్లు చెప్పారు.  దాంతో ఈ ప్రీక్వెల్‌ కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో రుక్మిణీ వసంత్‌ కథానాయికగా నటించే అవకాశం ఉందంటూ ఇటీవల వార్తలు వినిపించాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ‘కాంతార2’ చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుందని సన్నిహిత వర్గాల సమాచారం.  

‘‘కాంతార2’ను చూసేందుకు సిద్ధంగా ఉండండి. షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఇందుకోసం రిషబ్‌ స్వగ్రామంలో భారీ సెట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. దీనికోసం గ్రామస్థులు వారి సహకారం అందించారు. వారి అభిమానానికి కృతజ్ఞతలు. రిషబ్‌ శెట్టి ఇప్పటికే తన పాత్ర కోసం ప్రిపరేషన్‌ ప్రారంభించారు. ఇందులో ఆయన లుక్‌ డిఫెరెంట్‌గా ఉంటుంది. కచ్చితంగా మొదటిభాగంలో చూసినదానికంటే భిన్నంగా ఉంటుంది. ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి’’ అని తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని