Ritu Varma: నా కామెంట్ సెక్షన్‌లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ

‘డార్లింగ్‌’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్‌ మధ్య బుధవారం సోషల్‌ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు.

Published : 19 Apr 2024 12:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘డార్లింగ్‌’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్‌ (nabha natesh) మధ్య బుధవారం సోషల్‌ మీడియాలో జరిగిన సంభాషణ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. పరిచయం లేని మహిళను డార్లింగ్ అని పిలవడం నేరమని, కామెంట్‌ చేసేముందు మాటలు జాగ్రత్త అంటూ నభా నటేశ్‌ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడీ గొడవలోకి నటి రీతూవర్మ (Ritu Varma)ను భాగం చేశారు. ‘నా కామెంట్స్‌ సెక్షన్‌లో మీ పంచాయతీ ఏంటి?’ అని ఆమె ప్రశ్నించారు. ఇంతకీ, ఆ నటీనటుల సంభాషణలోకి రీతూవర్మ ఎలా భాగమయ్యారంటే..

నటి రీతూవర్మ కొన్ని రోజుల క్రితం ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన చిత్రాలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. వాటిపై తాజాగా ప్రియదర్శి స్పందించారు. ‘‘వావ్‌ రీతూ డార్లింగ్‌.. ఎంత అందంగా ఉన్నావో. నీ అందానికి ముగ్ధుడనయ్యా. మాటలు రావడం లేదు’’ అని కామెంట్‌ చేశారు. దీనిపై నభా నటేశ్‌ స్పందిస్తూ.. ‘‘ఇతను మళ్లీ మొదలుపెట్టాడు. ఆడవాళ్ల కామెంట్‌ సెక్షన్‌పై ఉన్నట్టుండి ఆసక్తి చూపిస్తున్నాడు. అందరినీ డార్లింగ్‌ అని పిలవడం ఏంటి? నీ బ్రెయిన్‌ పనిచేయడం లేదా?’’ అని అసహనం వ్యక్తం చేయగా..‘‘నేను ఎవరినైనా డార్లింగ్‌ అని పిలిస్తే నీకెందుకు ఇబ్బంది?’’ అని అతడు బదులిచ్చారు. ఈ మొత్తం సంభాషణపై రీతూవర్మ స్పందిస్తూ.. ‘‘నా కామెంట్‌ సెక్షన్‌లో మీ పంచాయితీ ఏంటి?’’ అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదేదో సినిమా ప్రమోషన్‌లా ఉందని వారు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని