Deepika padukone: లేడీ సింగమ్‌.. శక్తి శెట్టి

శక్తి శెట్టిగా తన అభిమానులకు యాక్షన్‌ రుచి చూపించేందుకు రంగంలోకి దిగనుంది బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె. కథానాయకులకు సమానంగా యాక్షన్‌ సన్నివేశాలు చేసే ఈ భామ ‘సింగమ్‌ అగైన్‌’తో రానుంది.

Updated : 21 Apr 2024 13:32 IST

క్తి శెట్టిగా తన అభిమానులకు యాక్షన్‌ రుచి చూపించేందుకు రంగంలోకి దిగనుంది బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె. కథానాయకులకు సమానంగా యాక్షన్‌ సన్నివేశాలు చేసే ఈ భామ ‘సింగమ్‌ అగైన్‌’తో రానుంది. దర్శకుడు రోహిత్‌ శెట్టి కాప్‌ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవగణ్‌, కరీనా కపూర్‌, టైగర్‌ ష్రాఫ్‌, రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అర్జున్‌ కపూర్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని దీపిక కొత్తలుక్‌ని రోహిత్‌ శెట్టి ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. ‘రీల్‌ అయినా...రియల్‌ అయినా... ఈమె నా హీరో. లేడీ సింగమ్‌’ అంటూ వ్యాఖ్యల్ని జోడించారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, జియో స్టూడియోస్‌తో కలిసి అజయ్‌ దేవగణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలకు సిద్ధమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని