RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్’కు మరో రెండు అవార్డులు.. హాలీవుడ్‌లో హవా
రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ సినిమా మరో అవార్డులకు ఎంపికైంది.
ఇంటర్నెట్ డెస్క్: దర్శకుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సినిమా హవా హాలీవుడ్‌లో కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రానికి తాజాగా మరో రెండు అవార్డులు వరించాయి. ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ స్పాట్‌లైట్ విన్నర్‌గా ఈ చిత్రం నిలిచింది. నటులు, సాంకేతిక నిపుణులందరికీ ఈ అవార్డు దక్కుతుంది. ‘అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్’ ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగానూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ సత్తా చాటింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేసింది నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ‘సన్‌సెట్ సర్కిల్’, ‘శాటర్న్’ అవార్డులూ గెలుచుకుంది.
ఇటీవల.. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (ఎన్.వై.ఎఫ్.సి.సి) పురస్కారాల్లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఎంపికైన సంగతి తెలిసిందే. ఇండియాలో సంచలనం సృష్టించిన ఈ సినిమా అమెరికా, జపాన్‌లోనూ విడుదలై, అక్కడా హిట్ అందుకుంది. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాల్ని స్ఫూర్తిగా తీసుకుని ఓ కల్పిత కథతో రూపొందించిన ఈ సినిమాలోని ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటనకు ప్రేక్షక లోకం ఫిదా అయింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
రూ.50వేల చొప్పున తీసుకున్నారు.. భర్తల్ని వదిలేసి ప్రియుళ్లతో వెళ్లిపోయారు
-
Crime News
Crime News: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య బలవన్మరణం
-
Politics News
Kotamreddy: అభిమానం ఉండాలి.. రూ.కోట్లుంటే గెలవలేరు: కోటంరెడ్డి
-
Politics News
జగన్ గ్రాఫ్ పడిపోతోంది.. ఏపీ వెళ్లి పాదయాత్ర చేసుకో: షర్మిలకు కడియం సూచన
-
World News
Turkey- syria Earthquake: అద్భుతం.. మృత్యుంజయులుగా బయటకొచ్చిన చిన్నారులు
-
India News
Cheetah: అవి పెద్దయ్యాక మనల్ని తినేస్తాయి.. మన పార్టీ ఓట్లను తగ్గించేస్తాయి..