RRR: మరో అంతర్జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ‘ఆర్ఆర్‌ఆర్‌’..

 ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మరో ఘనత సొంతం చేసుకుంది. సన్‌సెట్‌ సర్కిల్‌ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. 

Published : 30 Nov 2022 13:39 IST

హైదరాబాద్‌: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదలైన దగ్గర నుంచి ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఇప్పటికే పలు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ రాజమౌళి అద్భుతానికి మరో ఘనత దక్కింది. సన్‌సెట్‌ సర్కిల్‌ అవార్డు (Sunset Circle Awards)ల్లో ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విజేతగా నిలిచింది.

బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ఈ సినిమా మరో 4 అంతర్జాతీయ చిత్రాలతో పోటీపడి ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇక రాజమౌళి ఉత్తమ దర్శకుల విభాగంలో రన్నరప్‌గా నిలిచారు. అలాగే బెస్ట్‌ ఎడిటింగ్ విభాగంలోనూ ఈ చిత్రం రన్నరప్‌గా ఉంది. ఇక ఇటీవలే అమెరికాలో హాలీవుడ్‌ చిత్రాలకు ఇచ్చే శాటర్న్‌ అవార్డు ఈ ఏడాది ఆర్‌ఆర్‌ఆర్‌ను వరించిన విషయం తెలిసిందే. ఇలా ప్రపంచవ్యాప్తంగా అవార్డుల్లో సత్తా చాటుతున్న ఈ సినిమాకు ఆస్కార్‌ కూడా ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్‌.  ఈ మేరకు సోషల్‌మీడియాలో సందడి చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని