SSMB29: మహేశ్‌- రాజమౌళి కాంబో.. టైటిల్‌ అదేనా?

మహేశ్‌, రాజమౌళిల మూవీ టైటిల్‌ ఇదేనంటూ నెట్టింట చర్చ జరుగుతోంది.

Published : 16 Feb 2024 16:00 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు మహేశ్‌ బాబు (Mahesh Babu), దర్శకుడు రాజమౌళి (Rajamouli)ల సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా? అని అభిమానులంతా ఆసక్తిగా ఉన్నారు. ఈక్రమంలో రోజుకో రూమర్‌ చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకు.. హీరోయిన్‌, కీలక పాత్రధారి, టెక్నికల్‌ టీమ్‌పై ఊహాగానాలు వినిపించగా ఇప్పుడు టైటిల్‌ వంతు వచ్చింది. తమ చిత్రానికి రాజమౌళి.. మహారాజ్‌ (Maharaj) పేరు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారంటూ చిత్ర పరిశ్రమలో, నెట్టింట చర్చ జరుగుతోంది. టైటిల్‌ బాగుందని కొందరు అంటుంటే అంత పెద్ద ప్రాజెక్టుకు సింపుల్‌ నేమ్‌ పెడతారా? అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

యాక్షన్‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ హీరోయిన్‌గా, హాలీవుడ్‌ ప్రముఖ నటుడు క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ కీలకపాత్ర పోషించనున్నారని ఇటీవల వార్తలొచ్చాయి. సినిమాటోగ్రాఫర్‌గా పి.ఎస్‌.వినోద్‌, వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌గా ఆర్‌.సి.కమల్ కణ్ణన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా మోహన్‌ బింగి, ఎడిటర్‌గా తమ్మిరాజు రంగంలోకి దిగారని టాక్‌ వినిపించింది. ఈ సినిమాకు SSMB29 అనేది వర్కింగ్‌ టైటిల్‌. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. 

మహేశ్‌బాబు కూడా ఈ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. తన లుక్‌ను కూడా మార్చుకున్నారు. ఇటీవల తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా దిగిన ఫొటోల్లో మహేశ్‌ గడ్డంతో కనిపించారు. భారీ బడ్జెట్‌, అత్యున్నత టెక్నాలజీని   ఈ సినిమా కోసం వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇక అధికారికంగా ప్రకటించి, షూటింగ్‌ మొదలుపెట్టడమే ఆలస్యం. దీనికి సంబంధించి అమెరికాకు చెందిన ఓ క్యాస్టింగ్‌ ఏజెన్సీతో రాజమౌళి చర్చలు జరిపారు. ఇది ఒకే సినిమాగా వస్తుందా? రెండు భాగాలుగా వస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని