Sai Dharam Tej: ఎందుకిలా చేశావ్‌.. వరుణ్ తేజ్‌ పెళ్లిపై సాయి ధరమ్ తేజ్‌ ఫన్నీ పోస్ట్‌

వరుణ్‌ తేజ్ (Varun Tej) పెళ్లి ఫొటోలను సాయి ధరమ్ తేజ్ షేర్ చేశారు. దీనికి ఆయన రాసిన క్యాప్షన్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

Published : 13 Nov 2023 16:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండస్టీలోనే కాదు.. చిరంజీవి ఫ్యామిలీలో ఏ వేడుక వచ్చినా మెగా హీరోలందరూ కలిసి సందడి చేస్తుంటారు. తాజాగా నాగబాబు కుమారుడు, నటుడు వరుణ్‌ తేజ్‌ పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇంకా సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతూనే ఉన్నాయి. తాజాగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కొన్ని ఫొటోలను ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ పోస్ట్‌కు ఆయన రాసిన క్యాప్షన్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

థియేటర్‌లో టపాసులు కాల్చిన ఆకతాయిలు.. పరుగులు తీసిన ప్రేక్షకులు.. వీడియో వైరల్‌

వరుణ్‌ - లావణ్య (Varun Lav) పెళ్లిలో తాను చేసిన హంగామా తెలిసేలా ఉన్న మూడు ఫొటోలను పంచుకున్న సాయి ధరమ్‌ తేజ్ వాటికి ఫన్నీ క్యాప్షన్‌ రాశారు. ‘ఎందుకు ఇంత పని చేశావ్ వరుణ్‌ బాబు.. నీకు పెళ్లి సంబరాలు.. నాకేమో నా స్వాతంత్ర్య పోరాటం’ అంటూ కొన్ని ఎమోజీలను జోడించాడు. వరుణ్‌తేజ్‌ పెళ్లి ఊరేగింపులో కారుకు అడ్డంగా వెళ్లి సాయి ధరమ్ తేజ్‌ హుషారుగా అందరినీ అలరించినట్లు ఆ ఫొటోలు చూస్తే అర్థమవుతోంది. దీనికి వరుణ్‌ తేజ్‌ స్పందిస్తూ ‘అంతేగా అంతేగా’ అంటూ తన ‘ఎఫ్‌2’లోని డైలాగును కామెంట్ చేశారు. ఇక మరోవైపు నాగబాబు ఇంట్లో దీపావళిని చాలా గ్రాండ్‌గా సెలబ్రెట్‌ చేసుకున్నారు. ఈ పండగ వేడుకలకు నూతన దంపతులు వరుణ్‌ తేజ్‌-లావణ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను వరుణ్ తన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని