Tiger 3: థియేటర్‌లో టపాసులు కాల్చిన ఆకతాయిలు.. పరుగులు తీసిన ప్రేక్షకులు.. వీడియో వైరల్‌

‘టైగర్‌ 3’ థియేటర్‌లో అభిమానులు హంగామా సృష్టించారు. ప్రేక్షకులను ఇబ్బంది పెట్టేలా భారీ ఎత్తున టపాసులు కాల్చారు.

Updated : 13 Nov 2023 15:45 IST

ముంబయి: సల్మాన్‌ ఖాన్‌ (salman khan) అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తోన్న చిత్రం ‘టైగర్‌ 3’ (Tiger 3). యశ్‌రాజ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దీపావళి కానుకగా ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఆయా థియేటర్ల వద్ద సందడి వాతావరణం కనిపించింది.

ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని మాలెగావ్‌ థియేటర్‌లో కొంతమంది అభిమానులు హంగామా సృష్టించారు. సల్మాన్‌ ఎంట్రీ సమయంలో థియేటర్‌లో పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు. ఈ అనూహ్య చర్యతో భయాందోళనలకు గురైన ప్రేక్షకులు.. అక్కడి నుంచి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు.. ఆకతాయిలు చేసిన పనిపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులకు, థియేటర్‌ యాజమాన్యానికి ఇబ్బందులు కలిగించే ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై సల్మాన్‌ ఖాన్‌ అసహనం వ్యక్తం చేశారు. ‘‘టైగర్‌ 3’ స్క్రీనింగ్‌లో టపాసులు కాల్చారనే వార్తలు విన్నా. ఇలాంటి ఘటనలకు పాల్పడటం ప్రమాదకరం. మనతోపాటు ఇతరులను ఇబ్బందులకు గురి చేసే ఇలాంటి పనులు చేయకుండా సినిమాని ఎంజాయ్‌ చేద్దాం. జాగ్రత్తగా ఉండండి’’ అని సల్మాన్‌ ట్వీట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని