Sakshi Vaidya: మలయాళ సీమలోకి ‘ఏజెంట్‌’ సుందరి

‘ఏజెంట్‌’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కొత్త అందం సాక్షి వైద్య.

Updated : 12 Apr 2024 12:28 IST

‘ఏజెంట్‌’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కొత్త అందం సాక్షి వైద్య. ఆ సినిమా ఆమెకు చేదు ఫలితాన్ని అందించినా.. వెంటనే ‘గాండీవధారి అర్జున’లో అవకాశం దక్కించుకుంది. కానీ, అదీ ఆమెకు ఆశించిన ఫలితాన్ని అందివ్వలేదు. అయితే ఇప్పుడామె ‘హాల్‌’ అనే సినిమాతో మలయాళంలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడిస్తూ టైటిల్‌ పోస్టర్‌ను పంచుకుంది. షేన్‌ నిగమ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్‌ విజయ్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. జేవీజే ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇదొక భిన్నమైన మ్యూజికల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి నందగోపాలన్‌ సంగీతమందిస్తున్నారు. ఇక సాక్షి ప్రస్తుతం తెలుగులో శర్వానంద్‌కు జోడీగా రామ్‌ అబ్బరాజు తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తోంది. ఇది ఇటీవలే చిత్రీకరణ ప్రారంభించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని