Salaar: ‘సలార్‌’ ఖరారు

ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘సలార్‌’ విడుదల ఖరారైంది. డిసెంబరు 22న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి.

Updated : 30 Sep 2023 13:53 IST

ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘సలార్‌’ విడుదల ఖరారైంది. డిసెంబరు 22న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ప్రభాస్‌, శ్రుతిహాసన్‌ జంటగా నటించారు. హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్నారు. అయితే నిర్మాణానంతర కార్యక్రమాల్లో చోటు చేసుకున్న జాప్యం ఫలితంగా వాయిదా వేస్తున్నట్టు ఇటీవలే సినీ వర్గాలు తెలిపాయి. తాజాగా క్రిస్మస్‌ సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. అదే రోజు బాలీవుడ్‌ నుంచి షారుక్‌ఖాన్‌ చిత్రం ‘డంకీ’ విడుదలవుతోంది. ‘కె.జి.ఎఫ్‌’ చిత్రాల తర్వాత ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సలార్‌’. భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం ‘సలార్‌’ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. అందులో రక్తమోడుతున్న దేహంతో కనిపిస్తున్నారు ప్రభాస్‌. ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని