Salaar 2: ‘సలార్‌ 2’ షూటింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన నటుడు

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కనున్న ‘సలార్‌ 2’ షూటింగ్‌ అప్‌డేట్‌ను నటుడు బాబీ సింహా పంచుకున్నారు.

Published : 04 Mar 2024 01:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సలార్‌ 2’ (Salaar) సినిమాకు సంబంధించి నటుడు బాబీ సింహా ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. ఏప్రిల్‌లో షూటింగ్‌ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘సలార్‌ 1’ విడుదల తర్వాత ఇటీవల ఓ వేడుకలో ప్రభాస్‌ని కలిశానని గుర్తు చేసుకున్నారు. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో బాబీ సింహా (Bobby Simha) కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్‌ పార్ట్‌ 1: సీజ్‌ఫైర్‌’ (Salaar: Part 1- Ceasefire) గతేడాది డిసెంబరు 22న విడుదలై, మంచి విజయం అందుకుంది. దానికి సీక్వెల్‌గా పార్ట్‌ 2ను ‘శౌర్యాంగ పర్వం’ పేరుతో రూపొందించనున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ప్రభాస్‌ అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూశారు. బాబీ సింహా ఇచ్చిన అప్‌డేట్‌ ప్రకారం పార్ట్‌ 2 వచ్చే ఏడాదిలో సినిమా విడుదల కావొచ్చు.

కొన్నిరోజుల క్రితం ఈ సీక్వెల్‌ గురించి నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ మాట్లాడుతూ.. స్క్రిప్టు పూర్తయిందని, ప్రభాస్‌- ప్రశాంత్‌ చిత్రీకరణ ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. పార్ట్‌ 1 వసూళ్లపై సంతృప్తిగా ఉన్నామన్నారు. హాలీవుడ్‌ సిరీస్‌ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ (Game of Thrones)లా ‘సలార్‌ 2’ ఉంటుందంటూ ప్రేక్షకుల అంచనాలు రెట్టింపు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని