Salaar Release Trailer: యాక్షన్‌ ప్యాక్డ్‌గా ‘సలార్‌’ రిలీజ్‌ ట్రైలర్‌..!

‘సలార్‌’ (Salaar) నుంచి మరో ట్రైలర్‌ విడుదలైంది. యాక్షన్‌ సీక్వెన్స్‌లతో ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.

Updated : 18 Dec 2023 15:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్‌ (prabhas), పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలుగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సలార్‌ పార్ట్‌ 1 సీజ్‌ ఫైర్‌’ (SALAAR). డిసెంబర్‌ 22న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ దగ్గరవుతోన్న సందర్భంగా చిత్రబృందం అభిమానులకు వరుస సర్‌ప్రైజ్‌లు ప్లాన్‌ చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ‘సలార్‌’ రిలీజ్‌ డేట్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. మనసుని హత్తుకునే స్నేహం, అబ్బురపరిచే యాక్షన్‌ సీక్వెన్స్‌లతో ఈ ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగింది.

బద్ధ శత్రువులుగా మారే ఇద్దరు స్నేహితుల కథాంశంతో ‘సలార్‌’ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగాన్ని ‘సలార్‌ పార్ట్‌ 1 సీజ్‌ ఫైర్‌’ పేరుతో విడుదల చేయనున్నారు. శ్రుతిహాసన్‌ (salaar heroine) హీరోయిన్‌. మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ప్రతినాయకుడు. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు, దర్శకుడు టీనూ ఆనంద్‌, జగపతి బాబు, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘సలార్‌’.. ‘కేజీయఫ్‌’ యూనివర్స్‌లోకి వస్తుందనే రూమర్స్‌పై ప్రశాంత్‌ నీల్‌ ఇటీవల స్పందించారు. రెండింటికీ సంబంధం ఉండదని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని