Salaar: ‘సలార్‌’ సక్సెస్‌ పార్టీ.. వీడియోలు వైరల్‌

‘సలార్‌’ (Salaar) సక్సెస్‌ పార్టీ వేడుకగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Updated : 13 Jan 2024 15:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘సలార్‌’ (Salaar) విజయాన్ని పురస్కరించుకొని చిత్రబృందం వేడుక చేసుకుంది. శుక్రవారం సాయంత్రం బెంగళూరులోని ఓ ప్రముఖ రెస్టారంట్‌లో ఈ సినిమా విజయోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రభాస్‌, శ్రుతిహాసన్‌, ఈశ్వరీరావు, జగపతిబాబు ఇతర చిత్రబృందం పాల్గొని సందడి చేశారు. ‘హలో మేడమ్‌.. మమ్మీ.. బ్యూటిఫుల్‌ మమ్మీ’ అంటూ ఈశ్వరీరావును ప్రభాస్‌ ఆత్మీయంగా పలకరించారు. ఈ పార్టీకి సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

saindhav movie review: సైంధ‌వ్‌ రివ్యూ.. వెంకటేశ్‌ యాక్షన్ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే!

‘ఆదిపురుష్‌’ తర్వాత ప్రభాస్‌ (Prabhas) నుంచి వచ్చిన చిత్రమిది. ప్రశాంత్‌ నీల్‌ (Prasanth neel) దర్శకత్వం వహించారు. యాక్షన్‌ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్‌ దేవ పాత్ర పోషించగా.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ వరదరాజ్‌ మన్నార్‌గా కనిపించారు. భారీ అంచనాల మధ్య డిసెంబర్‌ 22న ఈ చిత్రం విడుదలైంది. దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి విజయాన్ని అందుకుంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ను పవర్‌ఫుల్‌ రోల్‌లో చూడటం ఆనందంగా ఉందని అభిమానులు ప్రశంసలతో ముంచెత్తారు. కథ, కీలక పాత్రధారుల నటన, హీరో ఎలివేషన్స్‌ ప్లస్‌గా మారాయి. ఖాన్సార్‌ అందులోని పాత్రలను ‘సలార్‌ సీజ్‌ఫైర్‌’తో పరిచయం చేసిన దర్శకుడు.. రాజమన్నార్‌ తర్వాత ఖాన్సార్‌ సామ్రాజ్య సింహాసనాన్ని ఎవరు అధిష్ఠించనున్నారనే ఆసక్తికర అంశంతో ‘సలార్‌ శౌర్యాంగపర్వం’ను సిద్ధం చేయనున్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని