Salaar: ఆ రూమర్స్‌పై స్పందించిన ‘సలార్‌ 2’ నిర్మాణ సంస్థ.. ఏమందంటే?

‘సలార్‌ 2’ విషయంలో వచ్చిన రూమర్స్‌పై నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ స్పందించింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టింది.

Published : 26 May 2024 12:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరో ప్రభాస్‌ (Prabhas)- డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సలార్‌’ (Salaar). బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాకి సీక్వెల్‌ ఉందన్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌కు, ప్రశాంత్ నీల్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్స్‌లు వచ్చాయని, అందుకే ‘సలార్‌ 2’ (Salaar 2) ప్రాజెక్టు రద్దు అయిందని ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. ఆ రూమర్స్‌పై నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ స్పందించింది. సెట్స్‌లో ప్రభాస్‌- ప్రశాంత్‌ నీల్‌ నవ్వుతూ కనిపించిన దృశ్యాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. వారు నవ్వకుండా ఉండలేరు అంటూ పరోక్షంగా రూమర్స్‌ని ఖండించింది. 

‘సలార్‌ పార్ట్‌ 1: సీజ్‌ఫైర్‌’ (Salaar: Part 1- Ceasefire) గతేడాది డిసెంబరులో విడుదలై, ప్రభాస్‌ అభిమానుల్లో జోష్‌ నింపింది. దీంతో, ‘శౌర్యాంగ పర్వం’ (shouryanga parvam) పేరుతో రూపొందనున్న పార్ట్‌ 2పై అంచనాలు నమోదయ్యాయి. పలు సినీ వెబ్‌సైట్లు ఈ మూవీ నిలిచిపోయిందని వార్తలు రాయడంతో.. ఫ్యాన్స్‌ సందేహంలో పడ్డారు. తాజా అప్‌డేట్‌తో దానికి చెక్‌ పడినట్టైంది. ఈ సినిమా స్క్రిప్టు పూర్తయిందని నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ కొన్ని నెలల క్రితమే చెప్పడం గమనార్హం. హీరో, డైరెక్టర్‌ షూటింగ్‌ ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. హాలీవుడ్‌ సిరీస్‌ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా ‘సలార్‌ 2’ ఉంటుందన్నారు.

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి డైరెక్షన్‌లో ‘రాజాసాబ్‌’ (Rajasaab)లో నటిస్తున్నారు. మరోవైపు, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాతో ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ (Spirit) చిత్రాన్ని ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు