Salaar Teaser: మాస్‌ యాక్షన్‌ సలార్‌

‘సలార్‌’ ప్రపంచంలోకి అభిమానులకు స్వాగతం పలికారు ప్రభాస్‌. ఆయన హీరోగా నటించిన ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. హోంబలే ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక.

Updated : 07 Jul 2023 05:43 IST

‘సలార్‌’ ప్రపంచంలోకి అభిమానులకు స్వాగతం పలికారు ప్రభాస్‌. ఆయన హీరోగా నటించిన ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. హోంబలే ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్‌ (Salaar Teaser) గురువారం విడుదలైంది. ‘‘సింహం.. చిరుత.. పులి.. ఏనుగు.. ఇవన్నీ చాలా ప్రమాదకరం. కానీ, జురాసిక్‌ పార్క్‌లో కాదు. ఎందుకంటే ఆ పార్కులో..’’ అంటూ టీనూ ఆనంద్‌ డైలాగ్‌తో ప్రభాస్‌ పాత్రను.. అతని ప్రపంచాన్ని పరిచయం చేసిన తీరు ఆసక్తి రేకెత్తించింది. దాదాపు నిమిషంన్నరకు పైగా నిడివి ఉన్న ఈ ప్రచార చిత్రంలో ప్రభాస్‌ నుంచి ఒక్క డైలాగ్‌ వినిపించకున్నా.. ఆయన పాత్రకు ఇచ్చిన మాస్‌ ఎలివేషన్స్‌.. రకరకాల ఆయుధాలతో శత్రువుల్ని వేటాడుతున్న తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ టీజర్‌తోనే సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు చిత్ర బృందం స్పష్టత ఇచ్చేసింది. తొలి భాగం ‘సలార్‌: పార్ట్‌1: సీజ్‌ ఫైర్‌’ పేరుతో సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో 14 భారీ సెట్స్‌ వేసి మరీ చిత్రీకరణ జరిపినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: రవి బస్రూర్‌, ఛాయాగ్రహణం: భువన గౌడ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని