Salaar2: సలార్‌ 2 ఈ నెలాఖరు నుంచే

ఏకకాలంలో రెండు మూడు సినిమాలతో ప్రయాణం చేయడంలో ప్రభాస్‌ రాటుదేలారు. కొన్నేళ్లుగా ఆయన ప్రయాణం అదే తరహాలోనే సాగుతోంది.

Updated : 06 May 2024 09:35 IST

కకాలంలో రెండు మూడు సినిమాలతో ప్రయాణం చేయడంలో ప్రభాస్‌ రాటుదేలారు. కొన్నేళ్లుగా ఆయన ప్రయాణం అదే తరహాలోనే సాగుతోంది. చేస్తున్న సినిమా పూర్తవ్వక ముందే, మరో సినిమాని పట్టాలెక్కిస్తూ సమాంతరంగా ప్రాజెక్టుల్ని నడిపిస్తున్నారు. ప్రస్తుతం ‘రాజాసాబ్‌’ సినిమాలో నటిస్తున్న ఆయన... ఒప్పుకున్న మరో రెండు కొత్త చిత్రాల్నీ ఏకకాలంలో సెట్స్‌పైకి తీసుకెళుతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్‌ సినిమాని జులైలోనే ప్రారంభించనున్నారు. దీంతోపాటు, ‘సలార్‌ 2’ చిత్రీకరణకీ ప్రభాస్‌ పచ్చజెండా ఊపారు. వచ్చే నెల నుంచి ప్రభాస్‌ లేకుండానే ‘సలార్‌2’ చిత్రీకరణని మొదలు పెట్టనున్నారు. ఆయన జులై నుంచి ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనున్నట్టు తెలిసింది. అంటే ఒకే నెలలో రెండు సినిమాలు షురూ అవుతాయన్నమాట. మరోవైపు ‘రాజాసాబ్‌’ చిత్రీకరణనీ పూర్తి చేయనున్నారు. ఈ ఏడాదిలోనే సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమానీ మొదలు పెడతారు. ఈ వరుస చూస్తుంటే.. అభిమానులు ఏళ్ల తరబడి ఎదురుచూసే అవసరం లేకుండా వెంట వెంటనే తన సినిమాలతో సందడి చేయనున్నారన్నమాట.

జపాన్‌లో..: అగ్ర హీరో రజనీకాంత్‌ చిత్రాలతో జపాన్‌లో మొదలైన ఆదరణ.. క్రమంగా ఇతర చిత్రాలకూ దక్కుతోంది. ఆ జాబితాలో ఇప్పుడు ‘సలార్‌’ చేరనుంది. ప్రభాస్‌ హీరోగా.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, శ్రుతిహాసన్‌ కీలక పాత్రల్లో ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కించిన చిత్రమిది. పలు భారతీయ భాషల్లో విడుదలై, ప్రపంచవాప్తంగా రూ.700 కోట్లు రాబట్టిన ఈ సినిమాని జులై 5న జపాన్‌లో విడుదల చేయనున్నట్టు ఆదివారం నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ ప్రకటించింది. ‘భారతీయ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’ జపాన్‌ ప్రేక్షకుల కోసం జులై 5న అక్కడి థియేటర్లలో విడుదలవుతోంది’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వివరాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు