Salman Khan: విక్కీ కౌశల్‌ను పక్కకు తోసేసిన సల్మాన్‌ బాడీగార్డ్స్‌.. వీడియో వైరల్‌

సల్మాన్‌ఖాన్‌ (Salman Khan)కు సంబంధించిన ఓ వీడియో తాజాగా నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. సల్మాన్‌ ప్రవర్తనను తప్పుబడుతూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

Published : 27 May 2023 02:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డులు (ఐఫా) - 2023కు సంబంధించి మీడియా సమావేశం తాజాగా దుబాయ్‌లో జరిగింది. బాలీవుడ్‌కు చెందిన సినీ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, ఈ కార్యక్రమంలో చోటుచేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్‌ బడా హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) ప్రవర్తనను నెటిజన్లు తప్పుబడుతున్నారు.

ఐఫా-2023 ప్రెస్‌మీట్‌ గురువారం దుబాయ్‌లో జరిగింది. సల్మాన్‌ ఖాన్‌తోపాటు విక్కీ కౌశల్‌ (Vicky Kaushal) సైతం ఈ విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన పలు విశేషాలను పంచుకున్నారు. ఇదిలా ఉండగా, దీనికి సంబంధించిన ఓ వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. ఈవెంట్‌లో పాల్గొన్న వారితో విక్కీకౌశల్‌ ఫొటోలు దిగుతుండగా.. అటుగా సల్మాన్‌ఖాన్‌ వచ్చారు. దీంతో ఆయన బాడీగార్డ్స్‌ విక్కీని పక్కకు తోసేశారు. మరోవైపు, విక్కీ ఏదో మాట్లాడుతున్నప్పటికీ సల్మాన్‌ ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతూ కనిపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సల్మాన్‌, ఆయన బాడీగార్డ్స్‌ ప్రవర్తించిన తీరుపై మండిపడుతున్నారు. ‘తోటి నటుడితో ఎలా ప్రవర్తించాలో సల్మాన్‌కు తెలియడం లేదా?’, ‘సల్మాన్‌ పొగరు ఈ వీడియోతో తెలుస్తుంది’, ‘ఇండస్ట్రీలో ఉన్న హీరోలతో ఎలా ప్రవర్తించాలో సల్మాన్‌ తన బాడీగార్డ్స్‌కు చెప్పాలి’, ‘కనీసం విక్కీకి ఒక సారీ అయినా చెప్పి ఉండాల్సింది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని