Anant Ambani: అంబానీ ఈవెంట్‌లో ‘నాటునాటు’ పాట.. స్టెప్పేసిన బాలీవుడ్‌ త్రయం

అనంత్‌-రాధిక ప్రీవెడ్డింగ్ వేడుకల్లో బాలీవుడ్‌ స్టార్స్‌ తెలుగు పాటకు చిందేశారు.

Updated : 03 Mar 2024 11:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా హుషారెత్తించి భారత్‌కు ఆస్కార్‌ను తీసుకొచ్చిన పాట ‘నాటునాటు’. ఈ పాటకు బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు సల్మాన్‌ ఖాన్‌, షారక్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌ ముగ్గురు కలిసి చిందేశారు. దీంతో సినీ ప్రియులంతా తెగ సంబరపడుతున్నారు. భారత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌, ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సీఈఓ వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధిక ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. గుజరాత్‌లోని జామ్‌ నగర్‌ వేదికగా జరుగుతోన్న ఈ వేడుకల్లో సినీ ప్రముఖలు వారి డ్యాన్స్‌లతో సందడి చేశారు.

‘కళ్లు చెదిరిపోయాయి వర్మా..’ శ్రీలీల క్లాసికల్‌ డ్యాన్స్‌ చూశారా?

బాలీవుడ్‌ టాప్‌ హీరోలు సల్మాన్‌, షారుక్‌, ఆమిర్‌లు ఒకచోట కలవడం చాలా అరుదు. అలాంటిది ముగ్గురు కలిసి అంబానీ ఈవెంట్‌లో ఫేమస్‌ పాటలకు డ్యాన్స్‌ వేసి అలరించారు. ఇందులో భాగంగానే నాటునాటు స్టెప్‌ వేశారు. ఆతర్వాత వారి సినిమాల్లో పాటల హుక్‌ స్టెప్‌లను రీక్రియేట్‌ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ తిరిగేస్తున్నాయి. ‘ఖాన్స్‌ ముగ్గురితో ఒకే స్టేజ్‌ మీద డ్యాన్స్‌ వేయించడం అంబానీకే సాధ్యం’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. ఈ బాలీవుడ్‌ స్టార్స్‌ టాలీవుడ్‌ పాటకు చిందేయడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ‘వావ్‌’ అంటున్నారు. ఈ ప్రీవెడ్డింగ్‌ ఈవెంట్‌కు రామ్‌చరణ్‌-ఉపాసన హాజరయ్యారు. వీళ్లిద్దరూ ధోనీ దంపతులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. వీళ్లందరూ కలిసి ఈవెంట్‌కు వెళ్తున్న వీడియోను సినీ, క్రీడాభిమానులు షేర్‌ చేస్తున్నారు. సినీ తారలు రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె, రాణీ ముఖర్జీ, షారుక్‌ఖాన్‌ కుటుంబం, అర్జున్‌ కపూర్‌, ఆలియాభట్‌-రణబీర్‌ కపూర్‌ కుటుంబం, దర్శకుడు అట్లీ తదితరులు ఈ వేడుకల్లో భాగమయ్యారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని