Salman Khan: ‘దబాంగ్‌ 4’ పనుల్లో సల్మాన్‌

‘దబాంగ్‌’ ఫ్రాంచైజీ చిత్రాల్లో చుల్‌బుల్‌ పాండేగా సల్మాన్‌ఖాన్‌ను అభిమానులు మర్చిపోలేరు. ‘దబాంగ్‌ 4’ వస్తుందంటూ అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Updated : 31 Mar 2024 13:47 IST

‘దబాంగ్‌’ ఫ్రాంచైజీ చిత్రాల్లో చుల్‌బుల్‌ పాండేగా సల్మాన్‌ఖాన్‌ను అభిమానులు మర్చిపోలేరు. ‘దబాంగ్‌ 4’ వస్తుందంటూ అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఓ తీపి కబురు వినిపించారు సల్మాన్‌. ఇటీవల జరిగిన ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన.. ‘‘అతి త్వరలో ‘దబాంగ్‌ 4’ రాబోతుంది. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్‌ పనుల్లోనే నేను, అర్బాజ్‌ ఖాన్‌ ఉన్నాము. కానీ.. ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే కథ సిద్ధం చేస్తామ’’ంటూ చెప్పుకొచ్చారు. మరోసారి చుల్‌బుల్‌ పాండే పాత్రలో సల్మాన్‌ చేసే హంగామా ఎలా ఉండబోతుందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని