Samantha: అభిమానుల ప్రేమకు సమంత ఫిదా.. ఫొటోలు వైరల్‌

తన అభిమానులతో కలిసి ప్రముఖ నటి సమంత సందడి చేశారు. ఫ్యాన్స్‌ మీట్‌ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Published : 24 Mar 2024 18:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటి సమంత (Samantha) ఫ్యాన్స్‌ మీట్‌లో సందడి చేశారు. అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ప్రేమతో వారిచ్చిన కానుకలకు ఫిదా అయ్యారు. కొందరి కోరిక మేరకు దుస్తులపై ఆటోగ్రాఫ్‌ చేశారు. అనంతరం ఫొటోలు దిగారు. సమంతోపాటు ఆ మీట్‌కు హాజరైన పలువురు ఫ్యాన్స్‌ నెట్టింట ఫొటోలు షేర్‌ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. ఈ సెలబ్రేషన్‌ (Samantha Fans Meet) హైదరాబాద్‌లో శనివారం రాత్రి జరిగినట్లు తెలుస్తోంది.

‘సిటడెల్‌: హనీ బన్నీ’ (Citadel: Honey Bunny)తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు సమంత. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించిన ఈ వెబ్‌సిరీస్‌ను రాజ్‌ అండ్‌ డీకే రూపొందించారు. ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్‌ ‘సిటడెల్‌’కు ఇండియన్‌ వెర్షన్‌గా రాబోతుంది. ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో స్ట్రీమింగ్‌ కానుంది. మరోవైపు, సమంత ‘టేక్‌ 20’ పేరుతో యూట్యూబ్‌ వేదికగా తన అనుభవాలను అందరితో పంచుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని