Samantha: మీ విజయాన్ని చూడాలని ఉంది: హాట్‌టాపిక్‌గా సమంత పోస్ట్‌

సోషల్‌ మీడియాలో సమంత పెట్టిన తాజా పోస్ట్‌ హాట్‌టాపిక్‌గా మారింది. ఆమె ఏం అన్నారంటే?

Published : 22 May 2024 17:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ హీరోయిన్‌ సమంత (samantha) పెట్టిన తాజా పోస్ట్‌ చర్చనీయాంశమైంది. సోషల్‌ మీడియా వేదికగా బయటపెట్టిన ఆమె మనసులోని మాట హాట్‌టాపిక్‌గా నిలిచింది. ‘‘మీ విజయాన్ని చూడాలని ఉంది’’ అని రాసి ఉన్న ఇమేజ్‌ను షేర్‌ చేస్తూ.. ‘మీ హృదయం ఏం కోరుకున్నా.. మీ ఆకాంక్షలు ఏమైనా.. నా సపోర్ట్‌ ఉంటుంది. విజయానికి మీరు అర్హులు’ అని క్యాప్షన్‌ పెట్టారు. కనీసం హ్యాష్‌ట్యాగ్‌ కూడా జోడించకపోవడంతో ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకుంటున్నారు.

సమంత ఐపీఎల్‌ గురించి పోస్ట్‌ పెట్టి ఉంటారంటూ అత్యధిక మంది ఫ్యాన్స్‌, నెటిజన్లు భావిస్తుండడం గమనార్హం. బుధవారం రాజస్థాన్‌, బెంగళూరు టీమ్స్‌ మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఉన్న సంగతి తెలిసిందే. క్రికెట్‌ అభిమాని అయిన సమంత వీటిలోని ఓ టీమ్‌ విజయాన్ని ఆకాంక్షించారని అనుకుంటున్నారు. విరాట్‌ కోహ్లీ అంటే ఆమెకు అభిమానం అని, అందుకే ఆయన ఆడుతున్న బెంగళూరు జట్టుని సపోర్ట్‌ చేస్తూ పోస్ట్‌ పెట్టారని వారిలో కొందరు ఊహించారు. అహ్మదాబాద్‌ వేదికగా రాత్రి 7:30 గం.లకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. సమంత కెరీర్‌ విషయానికొస్తే.. ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’లో నటిస్తున్నారు. దానికి నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఆమె నటించిన వెబ్‌సిరీస్ ‘సిటడెల్‌: హనీ బన్నీ’ త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని