Samantha: వరుణ్‌ ఫొటోపై సమంత కామెంట్‌.. నటుడు ఏమన్నారంటే..?

కొత్త ప్రాజెక్ట్‌ ప్రమోషన్స్‌, ఆరోగ్య సూత్రాలు, హెల్త్‌ అప్‌డేట్‌లతో ఇటీవల నెట్టింట యాక్టివ్‌గా ఉంటున్నారు నటి సమంత (Samantha). ఓ బాలీవుడ్‌ నటుడి ఫొటోపై తాజాగా ఆమె కామెంట్‌ చేశారు.

Published : 17 Apr 2024 19:43 IST

ముంబయి: యాక్టింగ్‌ నుంచి చిన్న విరామం తీసుకుని గత కొన్ని రోజులుగా ఆరోగ్యంపై ఫోకస్‌ పెట్టారు నటి సమంత (Samantha). ఈమేరకు ఆమె తరచూ ఇన్‌స్టా వేదికగా నెటిజన్లకు ఆరోగ్య, స్ఫూర్తిదాయక సూత్రాలు చెబుతున్న విషయం తెలిసిందే. ఇన్‌స్టాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ ఫొటోపై ప్రత్యేకంగా స్పందించారు. లేటస్ట్‌ ఫొటోషూట్‌కు సంబంధించిన ఓ ఫొటోని ఆయన షేర్‌ చేయగా.. ‘ఎవరు ఈ టీనేజర్‌?’ అని కామెంట్‌ చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘సమంత.. అతను ఎవరో నాక్కూడా తెలియదు. కానీ, సమ్మర్‌లో రానున్న ఓ వెబ్‌సిరీస్‌ కోసం (సమంతను ఉద్దేశించి) ఈ అందమైన అమ్మాయితో వర్క్ చేయనున్నాడని మాత్రమే నాకు తెలుసు’’ అని సరదాగా బదులిచ్చారు.

‘ఖుషి’ తర్వాత సమంత నటిస్తోన్న ప్రాజెక్ట్‌ ‘సిటడెల్‌’. బాలీవుడ్‌ దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కిస్తున్నారు. సమంత (Samantha)కు జోడీగా నటుడు వరుణ్‌ ధావన్‌ కనిపించనున్నారు. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా రానున్న ఈ సిరీస్‌ కోసం వీరిద్దరూ ఎంతో శ్రమిస్తున్నారు. యాక్షన్‌ సీక్వెల్స్‌లకు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నారు. హాలీవుడ్‌లో ప్రియాంక నటించిన ‘సిటడెల్‌’ చిత్రాన్నే రాజ్‌ అండ్‌ డీకే రీమేక్‌ చేస్తున్నారంటూ జరిగిన ప్రచారంపై గతంలో సామ్‌ స్పందించారు. అందులో నిజం లేదన్నారు. ‘సిటడెల్‌’ అన్ని దేశ భాషల్లోనూ తెరకెక్కుతోందని ఇండియన్‌ వెర్షన్‌లో తాము నటిస్తున్నామని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని