Samantha: అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్‌ ఫాజిల్‌ ‘ఆవేశం’కు సమంత రివ్యూ

మలయాళ హీరో ఫహాద్‌ ఫాజిల్‌ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు.

Updated : 24 Apr 2024 15:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆవేశం’. ఏప్రిల్‌ 11న విడుదలైన ఈ సినిమా మలయాళంలో మంచి విజయాన్ని సాధించింది. విమర్శకులు ప్రశంసలు అందుకున్న ఈ మూవీపై స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha) తాజాగా రివ్యూ ఇచ్చారు.

‘‘ఆవేశం’ ఫీవర్‌ ఇప్పుడల్లా తగ్గేలా లేదు. ఈ సినిమా నాకెంతో నచ్చింది. అన్ని రూల్స్‌ను ఈ చిత్రం బ్రేక్‌ చేసింది. సన్నివేశానికి, సన్నివేశానికి మధ్య జానర్‌లను మార్చారు. దీన్ని చూస్తున్నంతసేపు నవ్వుకున్నాను. భయపడ్డాను. కొన్ని సినిమాలను కచ్చితంగా థియేటర్లోనే చూసి ఆనందించాలి. అలాంటి వాటిల్లో ‘ఆవేశం’ ఒకటి. ఫహాద్‌ ఫాజిల్‌ సినిమాలను మిస్‌ కాకండి. ఆయన సినిమాలు వినోదాన్ని పంచుతాయి. ఆయన మరెన్నో విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు. చిత్రబృందం ఎంతోమందిలో స్ఫూర్తినింపిందని ప్రశంసించారు. మూవీ టీమ్‌కు అభినందనలు తెలిపారు.

‘ఆవేశం’ సినిమా విషయానికొస్తే.. ఫహాద్‌ ఫాజిల్‌ కెరీర్‌లోనే ఇది హిట్‌ చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు రూ.100కోట్లు వసూలు చేసి రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది విడుదలైన ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’, ‘ప్రేమలు’, ‘దిగోట్‌లైఫ్‌’ తర్వాత మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘ఆవేశం’ నిలిచింది. గ్యాంగ్‌స్టర్‌ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఫేమ్‌ జీతూ మాధవన్‌ దర్శకత్వం వహించారు. హీరో బాడీ లాంగ్వేజ్‌కు కామెడీ టైమింగ్‌కు ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని