Next Mahanati: సమంతను ‘మహానటి’ అన్న టాలీవుడ్‌ అగ్ర నిర్మాతలు..

సమంతపై ప్రముఖ నిర్మాతలు సురేష్‌బాబు, అల్లుఅరవింద్‌లు ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఆమె మరోమహానటి అవుతుందని చెప్పారు. 

Published : 04 Dec 2022 16:30 IST

హైదరాబాద్‌: దక్షిణాదిలో ఉన్న అగ్ర కథానాయికల్లో ఒకరైన సమంత తన నటనతో అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. సోషల్‌మీడియాలోనూ సమంతను ఫాలో అయ్యేవారు లక్షల్లోనే ఉంటారు. అంతగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది ఈ యశోద నటి. కేవలం సినీ ప్రేక్షకులే కాదు సెలబ్రిటీలు సైతం సమంత నటనపై పొగడ్తలు కురిపిస్తుంటారు. తాజాగా టాలీవుడ్‌ అగ్ర నిర్మాతలు సురేష్‌ బాబు, అల్లుఅరవింద్‌లు సమంతను మహానటిగా అభివర్ణించారు. ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు.

 బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌-2 కార్యక్రమానికి ఇటీవల సురేష్‌ బాబు, అల్లుఅరవింద్‌లు హాజరయ్యారు. ఆ షోలో భాగంగా సినీ పరిశ్రమలో తర్వాత మహానటి ఎవరు అని బాలకృష్ణ అడగ్గా.. ఇద్దరు నిర్మాతలు ‘సమంత’ అని బదులిచ్చారు. సౌత్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ‘తదుపరి మహానటి’ అయ్యే సత్తా ఉన్న ఏకైక నటి సమంతానే అని సమాధానం చెప్పారు. వాళ్లిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు సామ్‌ పేరు రాయడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక ఈ వీడియోను సమంత షేర్‌ చేస్తూ ధన్యవాదాలు తెలిపింది. ఇక అంత పెద్ద నిర్మాతల నుంచి ప్రశంసలు రావడంతో సమంత అభిమానులు ఫుల్‌ ఖుషీతో ఈ వీడియోను తెగ షేర్‌ చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవలే ‘యశోద’తో అందరి మెప్పు పొందిన సమంత గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘శాకుంతలం’లో నటిస్తోంది. దానితో పాటు సెన్సేషనల్‌ హీరో విజయ్‌దేవరకొండ సరసన ‘ఖుషి’ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతోంది. ఒక హాలీవుడ్‌ సినిమాలోనూ కనిపించనుంది.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని