Samantha Ruth Prabhu: ఓ మై లవ్‌ అంటూ సమంతా ట్వీట్‌... వైరల్‌ అవుతోన్న ఫొటోస్‌

తమన్నాతో కలిసి ఉన్న ఫొటోలను సమంతా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

Published : 20 Mar 2024 15:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సమంత (Samantha), వరుణ్‌ధావన్‌ కలిసి నటించిన యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ ‘సిటాడెల్‌’ (Citadel). రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల కానుంది. తాజాగా ముంబయి వేదికగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి కథానాయిక సమంత హాజరయ్యారు. ఈక్రమంలో ఆమె ముంబయిలో ఉంటున్న తన స్నేహితురాలు నటి తమన్నాను(Tamannah) కలిశారు. విజయ్‌ వర్మ ఫొటోలు తీస్తుండగా తమన్నా, సమంత పోజులిచ్చారు. వీటిని సమంత ‘ఓ మై లవ్‌’ అన్న క్యాప్షన్‌తో  ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

రాజ్‌, డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌కు ‘సిటాడెల్‌: హనీ-బన్నీ’ టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో కేకే మేనన్‌, సిమ్రన్‌, సోహమ్‌ మంజుదార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 1900ల నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగుతోందని..ఇందులోని యాక్షన్‌ సన్నివేశాలు అలరిస్తాయని టాక్‌ వినిపిస్తుంది. సమంత ఈ సిరీస్‌ కోసం మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. మరోవైపు తమన్నా ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘ఓదెల2’లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అశోక్‌తేజ దర్శకుడు. సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌, మధు క్రియేషన్స్‌ పతాకంపై డి.మధు నిర్మిస్తున్నారు. హెబ్బాపటేల్‌, వశిష్ఠ ఎన్‌.సింహ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని