Samantha: ‘శాకుంతలం’ సినిమా వెనక ఎన్నో సంవత్సరాల కష్టం ఉంది: సమంత

సమంత నటించిన ‘శాకుంతలం’ (Shaakuntalam) సినిమా విడుదల సమయం దగ్గరపడుతుండడంతో ఆమె ప్రమోషన్స్‌ జోరు పెంచింది. ముంబయిలో ఉంటూ వరస ఇంటర్వ్యూలు ఇస్తోంది.

Updated : 30 Mar 2023 15:49 IST

హైదరాబాద్‌: ఏ పాత్రలో నటించినా దానికి జీవం పోస్తూ అందులో ఒదిగిపోతుంది సమంత (Samantha). మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుని స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘శాకుంతలం’ (Shaakuntalam). ఈ చిత్రం ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ప్రచారం జోరు పెంచింది సామ్‌. తాజాగా ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ భారీ చిత్రాల్లో మహిళలు ప్రధాన పాత్రలో నటించడం అరుదు అని పేర్కొంది.

‘‘ సినిమా రంగంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎప్పటికప్పుడు నా సామర్థ్యాలను పెంచుకుంటూ పోవాలి. మంచి కథతో రూపొందుతున్న చిత్రాల్లో మహిళలు ప్రధాన పాత్రలో నటించడం చాలా అరుదుగా కనిపిస్తుంది. నా నటనపై నమ్మకంతో పెట్టుబడి పెట్టారంటే నేను ఆ ప్రాజెక్ట్‌ బాగా రావడం కోసం ఎంత కష్టాన్నైనా తట్టుకొని నటించాలి. ఇక ‘శాకుంతలం’ సినిమా ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడా రాజీ పడలేదు. మొదట అనుకున్న బడ్జెట్‌ కంటే సినిమా పూర్తయే సమయానికి ఖర్చు చాలా ఎక్కువైంది. దర్శకుడిపై, అతడి విజన్‌పై నిర్మాత ఎంతో నమ్మకం ఉంచారు. బహుశా ఒక  అమ్మాయి ప్రాధానపాత్రలో తీసిన అత్యంత ఖరీదైన చిత్రం ఇదేనేమో. ఈ సినిమా వెనకాల చాలా సంవత్సరాల కష్టం ఉంది.’’ అని సమంత తెలిపింది. 

ప్రస్తుతం సమంతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓవైపు మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటూనే సినిమాలకు సంబంధించిన పనుల్లో పాల్గొంటున్నందుకు ‘సామ్‌ నువ్వు గ్రేట్‌’ అని కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సమంత ‘శాకుంతలం’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. అలాగే సిటాడెల్‌(Citadel)లో నటిస్తోంది. ఇటీవల ‘ఖుషి’ చిత్రీకరణలోనూ భాగమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని