Shaakuntalam: ‘కేన్స్‌’లో శాకుంతలం మెరుపులు.. స్పందించిన సమంత

కేన్స్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సమంత (Samantha) నటించిన ‘శాకుంతలం’ (Shaakuntalam) సినిమా తన సత్తా చాటింది. నాలుగు అవార్డులను దక్కించుకుంది.

Updated : 05 Jan 2024 15:17 IST

హైదరాబాద్‌: సమంత (Samantha) లీడ్‌ రోల్‌లో నటించిన  చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam). గుణశేఖర్‌ దర్శకుడు. తాజాగా ఈ సినిమా కేన్స్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (Cannes World Film Festival)లో తన సత్తా చాటింది. ఏకంగా నాలుగు విభాగాల్లో విజేతగా నిలిచింది. ఈ మేరకు బెస్ట్‌ ఫారెన్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ ఇండియన్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ ఫాంటసీ ఫిల్మ్‌, బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌కు గానూ ఈ సినిమా ‘కేన్స్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ అవార్డులు సొంతం చేసుకుంది. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది. దీనిపై సమంత ఆనందం వ్యక్తం చేశారు. తమ చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు.

కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంను ఆధారంగా చేసుకుని గుణశేఖర్‌ దీన్ని తెరకెక్కించారు. శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ నటించారు. అల్లు అర్హ సైతం ఈ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. భారీ అంచనాల మధ్య గత నెలలో పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని