Citadel: ‘సిటాడెల్‌’ షూట్‌ పూర్తయింది.. అప్‌డేట్‌ ఇచ్చిన సమంత

Citadel: వరుణ్‌ ధావన్‌, సమంత కలిసి నటిస్తున్న ‘సిటాడెల్‌’ గురించి సామ్‌ అప్‌డేట్‌ను పంచుకున్నారు.

Published : 31 Jan 2024 01:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వరుణ్‌ధావన్‌, సమంత (Samantha) జంటగా నటిస్తోన్న యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ ‘సిటాడెల్‌’ (Citadel). రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని నెలల కిందటే ప్రారంభమైన ఈ సిరీస్‌ తాజాగా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. ఈ సిరీస్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను కథానాయిక సమంత పంచుకున్నారు. రాజ్‌ అండ్‌ డీకే, వరుణ్‌ధావన్‌తో కలిసి సమంత ‘సిటాడెల్‌’ రషెస్‌ చూశారు. అంతేకాదు, సిరీస్‌లో తన పాత్రకు డబ్బింగ్‌ కూడా మొదలు పెట్టారు. స్టూడియోలో ఉన్న ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు.

‘ఫ్యామిలీ మ్యాన్‌2’లో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో అదరగొట్టిన సమంత ‘సిటాడెల్‌’ కోసం ప్రత్యేకంగా సిద్ధమైంది. మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. ముఖ్యంగా వరుణ్‌, సామ్‌ కలిసి చేసే యాక్షన్‌ సన్నివేశాలు అలరిస్తాయని టాక్‌. 1990ల నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగుతోందని తెలుస్తోంది. ఎలాంటి డూప్‌ లేకుండా ఆమే స్వయంగా యాక్షన్‌ సీక్వెన్స్‌ను పూర్తి చేశారట. ఈ క్రమంలోనే స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. రుస్సో బ్రదర్స్‌ నిర్మిస్తున్న ఈ సిరీస్‌ పలు దేశాల్లో, వివిధ భాషల్లో రూపొందుతోంది. సిటాడెల్‌ మాతృకలో ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌ నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని