Samyukta Menon: తెలుగు సినిమా నేర్పించింది అదే!

బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన వర్తమాన కథానాయికల జాబితాలో మరొకరు చేరారు.

Published : 27 May 2024 01:09 IST

బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన వర్తమాన కథానాయికల జాబితాలో మరొకరు చేరారు. ఈమధ్యే వరుసగా దక్షిణాది భామలు హిందీ సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. ఆ వరసలో సంయుక్త మేనన్‌ కూడా చేరారు. 

తెలుగులో ఈమె పట్టిందంతా బంగారమే. విజయాలకి కేరాఫ్‌గా మారారు. మంచి కథల్ని, నటనకి ప్రాధాన్యమున్న పాత్రల్ని ఎంపిక చేసుకుంటుందనే పేరు తెచ్చుకున్నారు. హిందీలో చేస్తున్న తొలి చిత్రం విషయంలోనూ ఆమె తనదైన పంథాని అనుసరిస్తోంది. అగ్ర కథానాయకుల సరసన కాకుండా... ఓ కీలక పాత్రని ఎంపిక చేసుకొని అక్కడ జెండా పాతేందుకు సిద్ధమైంది. ప్రభుదేవా, కాజోల్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమాతో సంయుక్త మేనన్‌ హిందీలో పరిచయం అవుతోంది. ఆమె ఇందులో ఓ కీలక పాత్రని పోషిస్తుందన్నమాట. మూస పద్ధతుల్ని పక్కనపెట్టి ప్రయాణం చేయడమే నా పంథా అని చెప్పే సంయుక్త... ‘‘ఏ భాషలోకి వెళ్లినా అక్కడి పరిస్థితుల్ని, పని విషయంలో పద్ధతుల్ని  వెంటనే ఆకళింపు చేసుకుని నటించడం అలవాటైంది. అది తెలుగు సినిమానే నేర్పించింద’’ని చెబుతోంది సంయుక్త.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని