Prabhas: ‘స్పిరిట్‌’ తొలిరోజే రూ.150 కోట్లు వసూలు చేస్తుంది: సందీప్‌ రెడ్డి వంగా

ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ సినిమా కచ్చితంగా సూపర్‌ హిట్‌ అవుతుందని దర్శకుడు విశ్వాసం వ్యక్తం చేశారు.

Updated : 09 Apr 2024 13:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్‌’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా దర్శకుడి మాటలు వీటిని రెట్టింపు చేశాయి.

‘‘300 కోట్లతో ‘స్పిరిట్‌’ను తెరకెక్కిస్తున్నాం. శాటిలైట్‌, డిజిటల్‌ హక్కుల విక్రయంతోనే ఈజీగా ఆ బడ్జెట్‌ వచ్చేస్తుంది. విడుదలయ్యాక తొలిరోజే రూ.150కోట్లు కచ్చితంగా వస్తాయి. ఇది విశ్వాసం కాదు.. వ్యాపారం. ఏ సినిమా అయినా టీజర్‌, ట్రైలర్‌, పాటలు ఆకట్టుకోగలిగితే.. దానికి మొదటిరోజే మంచి వసూళ్లు వస్తాయి. ‘స్పిరిట్‌’లో ప్రభాస్‌ విభిన్నమైన లుక్‌లో కనిపిస్తారు. ఇప్పటి వరకు ఆయన్ను గత 24 సినిమాల్లో ప్రేక్షకులు ఒక విధంగా చూశారు. ఇప్పుడు మరోస్థాయిలో చూస్తారు. ప్రభాస్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయన వెనక్కి తిరిగి చూసే స్టైల్‌ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నేను ఆయన్ని చూపించే విధానం ఆడియన్స్‌కు నచ్చితే చాలు.. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది’’ అని అన్నారు.

ఇక ఇదే ఇంటర్వ్యూలో సందీప్ వంగా తెలుగు హిట్‌ చిత్రాల గురించి మాట్లాడారు. ‘బేబీ’, ‘ఉప్పెన’ కథలు మీ దగ్గరకు వస్తే దేనికి దర్శకత్వం వహిస్తారనే ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘‘నేను నిర్మాతగా సినిమా తీయాలని కొన్ని కథలు విన్నాను. కానీ, అవేవి నచ్చలేదు. కథ నచ్చితే నిర్మించడానికి, డైరెక్ట్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ‘ఉప్పెన’ చిత్రం చాలా బాగుంటుంది. ఆ ఐడియా నాకు నచ్చింది. భవిష్యత్తులో బయోపిక్‌ చేయాల్సి వస్తే.. మైఖేల్‌ జాక్సన్‌ జీవిత చరిత్రను తెరకెక్కిస్తా’’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు