ప్రేమ యుద్ధానికి సన్నాహాలు

‘బ్రహ్మాస్త్ర’లో జోడీగా ఆకట్టుకున్నారు బాలీవుడ్‌ యువజంట రణ్‌బీర్‌ కపూర్, అలియా భట్‌. ఇప్పుడు మరోసారి ‘లవ్‌ అండ్‌ వార్‌’ సినిమాతో అభిమానులను ప్రేమలో పడేయడానికి ముస్తాబవుతోందీ జంట.

Published : 18 May 2024 00:27 IST

‘బ్రహ్మాస్త్ర’లో జోడీగా ఆకట్టుకున్నారు బాలీవుడ్‌ యువజంట రణ్‌బీర్‌ కపూర్, అలియా భట్‌. ఇప్పుడు మరోసారి ‘లవ్‌ అండ్‌ వార్‌’ సినిమాతో అభిమానులను ప్రేమలో పడేయడానికి ముస్తాబవుతోందీ జంట. రణ్‌బీర్, అలియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నారు. విక్కీ కౌశల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణను త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘ప్రస్తుతం రామాయణం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు రణ్‌బీర్‌. దీని తర్వాత ఆగస్టులో మొదలు కానున్న ‘లవ్‌ అండ్‌ వార్‌’ చిత్రీకరణలో పాల్గొంటారు. ఈ ప్రాజెక్టు కోసం ముంబయిలో ఓ ప్రత్యేక సెట్‌ను తయారీ చేయించారు భన్సాలీ. మొదటి షెడ్యూల్‌లో భాగంగా సంగీతానికి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. రణ్‌బీర్, అలియాల మధ్య వచ్చే ప్రేమ పాటలు ఈ సినిమాకే ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి’’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వైఆర్‌ఎఫ్‌ నిర్మిస్తున్న స్పై థ్రిల్లర్‌ చిత్రంతో బిజీగా ఉంది అలియా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని