Bollywood: ఆ ఏడాది బ్రేకప్‌తో మొదలై ఫ్లాప్‌లతో ముగిసింది..!
ప్రముఖ హీరోయిన్ సారా అలీఖాన్ (Sara Ali khan) తన జీవితంలో 2020ను చెడ్డ సంవత్సరంగా అభివర్ణించింది. ఆ ఏడాది బ్రేకప్‌తో మొదలై తన సినిమాల పరాభవాలతో ముగిసిందని పేర్కొంది.
ముంబయి: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సారా అలీ ఖాన్ (Sara Ali khan). తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు సినిమా విషయాల కంటే వ్యక్తిగత విషయాలపరంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సారా తన జీవితంలో 2020ను ఓ చెడ్డ సంవత్సరంగా అభివర్ణించింది.
తన బ్రేకప్ గురించి సారా మాట్లాడుతూ..‘‘2020 సంవత్సరం కార్తిక్ ఆర్యన్(Kartik Aaryan) బ్రేకప్‌తో మొదలై నా సినిమాల పరాభవంతో ముగిసింది. ఆ ఏడాదంతా చాలా అధ్వానంగా గడిచింది. నా పేరు తరచూ ఇంటర్నెట్‌లో వినిపిస్తూనే ఉంది. ఎంతో దారుణంగా నన్ను ట్రోల్ చేశారు. కొన్నిసార్లు మనల్ని ట్రోల్ చేస్తారని తెలిసినా దాన్ని స్వీకరించడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఈరోజుల్లో ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం వల్ల ట్రోలింగ్ అనేది చాలా సులభమైపోయింది. నిజానికి మనం పడే బాధతో పోలిస్తే అది చాలా చిన్న విషయం. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు చాలా బాధలో ఉన్నప్పుడు దాని గురించి 20 మంది మాట్లాడుకున్నా పర్వాలేదు’’ అని చెప్పింది.
ఇక ‘లవ్ ఆజ్ కల్ 2’ (Love Aaj Kal 2) చిత్రీకరణ సమయంలో సారా-కార్తిక్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారని అన్నారు. అయితే ఈ ఏడాది న్యూయర్ పార్టీలో వీళ్లిద్దరూ కలిసి కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సారా నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో రెండు షూటింగ్ దశలో ఉన్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra news: సీఎస్‌తో ఉద్యోగసంఘాల భేటీ.. ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకారం
-
India News
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం
-
Movies News
Nani: నా అభిప్రాయం చెప్పినా సమస్యే అవుతోంది: నాని
-
Politics News
Rahul disqualification: రాహుల్ అనర్హత వెనుక కాంగ్రెస్‌లోనే కుట్ర!: భాజపా
-
Sports News
MIw vs UPw: నాట్‌సీవర్ బ్రంట్ అర్ధ శతకం.. యూపీ లక్ష్యం 183
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు