Sara Ali Khan: కొత్త ప్రాజెక్టుతో సారా అలీఖాన్‌..

ఈ మధ్యే ‘ఏ వతన్‌ మేరే వతన్‌’, ‘మర్డర్‌ ముబారక్‌’ లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది బాలీవుడ్‌ కథానాయిక సారా అలీఖాన్‌. మరో మూడు సినిమాలతో రోజుల్ని బిజీగా గడుపుతున్న ఈమె ఓ కొత్త ప్రాజెక్టుని పట్టాలెక్కించినట్లు తెలుస్తోంది.

Published : 22 May 2024 01:06 IST

మధ్యే ‘ఏ వతన్‌ మేరే వతన్‌’, ‘మర్డర్‌ ముబారక్‌’ లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది బాలీవుడ్‌ కథానాయిక సారా అలీఖాన్‌. మరో మూడు సినిమాలతో రోజుల్ని బిజీగా గడుపుతున్న ఈమె ఓ కొత్త ప్రాజెక్టుని పట్టాలెక్కించినట్లు తెలుస్తోంది. స్పై యాక్షన్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో సారాకి జోడీగా ఆయుష్మాన్‌ ఖురానా కనిపించనున్నట్లు సమాచారం. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమాకి ఆకాశ్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించనున్నారు. కరణ్‌ జోహార్‌ నిర్మాత. ‘తాజాగా ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. థ్రిల్‌ని పంచే యాక్షన్‌ సీక్వెన్స్‌లు, వినోదంలో ముంచెత్తే కామెడీ సన్నివేశాలు పుష్కలంగా ఉంటాయి. తొలిసారి జంటగా నటించనున్న సారా, ఆయుష్మాన్‌లు తప్పక మెప్పిస్తారు’ అని చిత్ర వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని