Saripodhaa Sanivaaram: పోరాటానికి శనివారం సరిపోదా!

‘హాయ్‌ నాన్న’ అంటూ సినీప్రియుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు నాని. ఓ వైపు ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్ని పరుగులు పెట్టిస్తూనే మరోవైపు తన కొత్త చిత్రం ‘సరిపోదా శనివారం’ను పట్టాలెక్కించేశారు.

Updated : 15 Nov 2023 13:16 IST

‘హాయ్‌ నాన్న’ అంటూ సినీప్రియుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు నాని. ఓ వైపు ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్ని పరుగులు పెట్టిస్తూనే మరోవైపు తన కొత్త చిత్రం ‘సరిపోదా శనివారం’ను పట్టాలెక్కించేశారు. ‘అంటే సుందరానికీ’ తర్వాత వివేక్‌ ఆత్రేయ - నాని కలయికలో రూపొందుతోన్న రెండో సినిమా ఇది. డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్‌ మోహన్‌ కథానాయిక. ఎస్‌.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. దీపావళి సందర్భంగా హైదరాబాద్‌లో రెగ్యులర్‌ చిత్రీకరణను ప్రారంభించారు. ప్రస్తుతం రామ్‌-లక్ష్మణ్‌ మాస్టర్స్‌ నేతృత్వంలో ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ తెరకెక్కిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. అలాగే ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలిపారు. వినూత్నమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో నాని రగ్గడ్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాకి జేక్స్‌ బిజోయ్‌ స్వరాలు సమకూరుస్తుండగా.. జి.మురళీ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని