Modi Biopic: మోదీ బయోపిక్‌లో సత్యరాజ్‌.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన నటుడు

మోదీ బయోపిక్‌లో తాను నటించనున్నట్లు వస్తోన్న వార్తలపై సత్యరాజ్‌ స్పందించారు.

Published : 22 May 2024 15:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌ (Narendra Modi Biopic)కు రంగం సిద్ధమైనట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మోదీ పాత్రలో ప్రముఖ నటుడు సత్యరాజ్‌ నటిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ వార్తలపై ఆయన స్పందించారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు. ‘నేను నరేంద్ర మోదీ (narendra modi) బయోపిక్‌లో నటించనున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదు. అవి చూసి నేనూ ఆశ్చర్యపోయాను. ఇటువంటి రూమర్స్‌ నమ్మకండి. ఆ చిత్రం కోసం ఇప్పటివరకు నన్నెవరూ సంప్రదించలేదు. సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి. ఒకవేళ ఈ బయోపిక్‌ కోసం ఎవరైనా సంప్రదించినా నేను అంగీకరించను. ఎందుకంటే ఇది నా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండే అవకాశముంది’ అని స్పష్టతనిచ్చారు. ఇక గతంలోనూ ఈ విషయంపై ఆయన (Sathyaraj) మాట్లాడుతూ ఇదే మాట చెప్పారు. మోదీ బయోపిక్‌లో తాను నటించబోనన్నారు.

‘దేవర’లో అవకాశం నా అదృష్టం.. తన పాత్ర గురించి చెప్పిన జాన్వీ కపూర్‌

మోదీ జీవితంపై బయోపిక్‌ రావడం ఇదేం తొలిసారి కాదు. ‘పీఎం నరేంద్ర మోదీ’ (PM Narendra Modi movie) పేరుతో గతంలో ఓ హిందీ చిత్రం తెరకెక్కింది. ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో వివేక్‌ ఒబెరాయ్‌ ప్రధాన పాత్ర పోషించారు. అందులో మోదీ బాల్యం నుంచి ప్రధాని అయ్యేవరకు చూపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని