Satyadev: సత్యదేవ్‌.. గరుడ

సత్యదేవ్‌ హీరోగా అభిషేక్‌ నామా నిర్మాణంలో ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ తెరకెక్కుతోంది. క్రాంతి బాల దర్శకుడు. ఈ చిత్రానికి ‘గరుడ చాప్టర్‌-1’ అనే టైటిల్‌ ఖరారు చేశారు.

Updated : 05 Jul 2023 14:11 IST

సత్యదేవ్‌ (Satyadev) హీరోగా అభిషేక్‌ నామా నిర్మాణంలో ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ తెరకెక్కుతోంది. క్రాంతి బాల దర్శకుడు. ఈ చిత్రానికి ‘గరుడ చాప్టర్‌-1’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. మంగళవారం సత్యదేవ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రంలో సత్య తన వీపుపై ఓ చిన్న పాపను మోస్తూ ఓ చేత్తో కాగడ.. మరో చేత్తో గొడ్డలి పట్టుకొని అడవిలో నిలబడి కనిపించారు. బ్యాగ్రౌండ్‌లో చుట్టూ ఉన్న చెట్లకు నిప్పంటుకొని ఉండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘‘సత్యదేవ్‌ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న చిత్రమిది. వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఉంటుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, కూర్పు: అమర్‌ రెడ్డి, ఛాయాగ్రహణం: ఎస్‌.సౌందర్‌ రాజన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని